కింగ్ హమద్ హైవేలో భారీ ట్రక్కులపై నిషేధం..!!

- August 07, 2025 , by Maagulf
కింగ్ హమద్ హైవేలో భారీ ట్రక్కులపై నిషేధం..!!

మనామాః రోడ్ల భద్రతకు సంబంధించి బహ్రెయిన్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 1 నుంచి కీలక రోడ్లపై భారీ వాహనాల రాకపోకలపై నిషేధం విధించింది. కింగ్ హమద్ హైవేపై పీక్ అవర్స్ సమయంలో మూడు టన్నుల కంటే ఎక్కువ బరువున్న భారీ వాహనాల రాకపోకలను నిషేధించారు.ప్రతిరోజు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2  నుండి 3 గంటల వరకు వర్తిస్తుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ తెలిపింది. అయితే, అత్యవసర మరియు లైసెన్స్ పొందిన పబ్లిక్ సర్వీస్ వాహనాలకు ఈ నిషేధ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com