సౌదీ ప్రీమియం రెసిడెన్సీ కోసం 40వేల మంది దరఖాస్తు..!!
- August 07, 2025
రియాద్: సౌదీ అరేబియా ప్రీమియం రెసిడెన్సీ కోసం ఇన్వెస్టర్లు పోటీ పడుతున్నారు. జనవరి 2024 నుంచి జూలై 2025 మధ్య దేశ, విదేశాలకు చెందిన వారి నుంచి 40,163 దరఖాస్తులు వచ్చాయి. ప్రీమియం రెసిడెన్సీ స్కీమ్ ను ప్రకటించిన 2024లో మొత్తం 8,074 మందికి రెసిడెన్సీలను జారీ చేశారు. అత్యధికంగా అసాధారణ ప్రతిభ కలిగిన 5,578 మందికి రెసిడెన్సీ పర్మిట్లు ఇవ్వగా.. టాలెంట్ వర్గానికి 348 పర్మిట్లు జారీ చేశారు. ఆ తర్వాత స్థానాల్లో రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లు, బిజినెస్ ఇన్వెస్టర్లు ఉన్నారు.
ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లకు అనేక రకాల బెనిఫిట్లను అందిస్తున్నారు. అపరిమిత ఫ్యామిటీ రెసిడెన్సీ అనుమతితోపాటు వీసా లేకుండానే ఎన్నిసార్లయిన రాకపోకలు సాగించవచ్చు. అలాగే, ప్రవాస ట్యాక్స్ నుండి మినహాయింపు పొందడంతోపాటు ప్రాపర్టీలను, సొంతంగా వాహనాలను కలిగి ఉండవచ్చు. స్పాన్సర్ లేకుండా ప్రైవేట్ రంగంలో జాబ్ చేసే అవకాశాలను పొందవచ్చు.
తాజా వార్తలు
- Dubai Media Council announces return of Dubai International Film Festival
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ







