CSEAM టిజైన్ కేసుల విచారణాధికారులకు శిక్షణ
- August 09, 2025
హైదరాబాద్ : బాలలపై జరిగే లైంగిక వేధింపులు, లైంగిక దాడుల కేసులతో పాటు బూతు బొమ్మలతో బాలలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలపై నమోదయ్యే కేసులను విచారించే సిఎస్ఇఎఎం (చైల్డ్ సెక్సువల్ ఎక్స్ ప్లోయిటేషన్ అండ్ అబ్యూస్ మెటీరియల్) విచారణాధికారులకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టిజిసిఎస్బి) నిర్వహించిన వారం రోజుల శిక్షణ ముగిసింది. కమాండ్ కంట్రోల్లోని టిజిసిఎ సిబి కార్యాలయంలో గల సైబర్ అకాడమిలో ఈ నెల ఒకటవ తేదీన మొదలైన ఈ శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో టిజిసిఎస్బి డైరక్టర్ శిఖాగోయల్ మాట్లాడుతూ ఈ శిక్షణలో టిజిసిఎస్బితో పాటు ఇండియన్ చైల్డ్ ప్రొటెక్షన్ కలిసి నిర్వహించాయని, శిక్షణలో భాగంగా విచారణాధికారులకు అనేక అంశాలపై తర్ఫీదు ఇచ్చామని తెలిపారు.
అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్ ప్లోయిటెడ్ చిల్డ్రన్ అనే సంస్థ నుంచి వచ్చే సైబర్ టిప్టాన్ నివేదికల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, కేసుల క్లిష్టత దృష్ట్యా శిక్షణ నిర్వహించామని ఆమె తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ పోలీసు విభాగం 561 టిజైన్ల ఆధారంగా 510 ఎఫ్ ఐఆర్లను నమోదు చేసిందని ఆమె వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 26 పోలీసు విభాగాలకు చెందిన 151 మంది విచారణాధికారులు శిక్షణలో పాల్గొన్నారని, శిక్షణలో భాగంగా 204 సైబర్ టిప్రోన్ ఫైళ్లన సమీక్షించి కేసుల నిర్వహణపై అనుభవం పొందారని ఆమె తెలిపారు. దీంతో పాటు ఈ శిక్షణలో చట్టపరమైన మాడ్యూళ్లు. ఒసిన్ట్, ఫోరెన్సిక్ టూల్స్, సెర్చ్ అండ్ సిజ్ పద్ధతులు, సోషల్ మీడియా ట్రేసింగ్, అసెస్మెంట్ అండ్ ఫీడ్ బ్యాక్ అంశాలపైనా వీరికి నిపుణులైన వా చేత తర్ఫీదును ఇప్పించామని శిఖా గోయల్ తెలిపారు. బాలల రక్షణ, సైబర్ నేరాల నివా ణకు టిజిసిఎస్బి చేబడుతున్న నిరంతర కృషిలో ఇది ఒక భాగమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!