రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన
- August 12, 2025
అమరావతి: అమరావతిలో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన దిశగా మరో కీలక అడుగు పడుతోంది. రాజధాని పరిధిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది.
తుళ్లూరు–అనంతవరం గ్రామాల మధ్య విస్తరించిన 21 ఎకరాల భూమిపై ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంస్థ (CRDA) తాజాగా కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, నటుడు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.ఆయనే ఈ ఆసుపత్రి అభివృద్ధికి కీలకంగా కృషి చేస్తున్నారు.
అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభ దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు.తర్వాత దాన్ని 1000 పడకల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక ఉందని సమాచారం.
ఈ ఆసుపత్రికి సంబంధించి తొలి ప్రణాళికలు 2014–2019 కాలంలోనే రూపొందినవే. అప్పట్లోనే భూమి కేటాయించినప్పటికీ, 2019లో పాలన మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి భూమి కేటాయించడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు







