గ్రేటర్ ఇజ్రాయెల్ ప్రణాళికలను తిరస్కరించిన సౌదీ అరేబియా..!!
- August 14, 2025
రియాద్: "గ్రేటర్ ఇజ్రాయెల్ " ప్రణాళికలను సౌదీ అరేబియా తిరస్కరించింది. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రకటనలను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయెల్ విస్తరణ ప్రణాళికలను సౌదీ అరేబియా పూర్తిగా తిరస్కరిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, పాలస్తీనా ప్రజలు తమ స్వంత భూమిపై తమ స్వతంత్ర మరియు సార్వభౌమ రాజ్యాన్ని స్థాపించుకునే చారిత్రక మరియు చట్టపరమైన హక్కును పొందేందుకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేసింది.
అంతర్జాతీయ చట్టబద్ధత పునాదులను దెబ్బతీసే, దేశాల సార్వభౌమత్వాన్ని స్పష్టంగా ఉల్లంఘించే.. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ శాంతి భద్రతకు ముప్పు కలిగించే ఇజ్రాయెల్ ఆక్రమణ ప్రణాళికకు అంతర్జాతీయ సమాజం వ్యతిరేకించాలని సౌదీ అరేబియా పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి