ఖతార్ సముద్ర తీరంలో 100 కిలోల హషీష్ స్వాధీనం..!!
- August 15, 2025
దోహా: ఖతార్ సముద్ర తీరంలో భారీగా హషీష్ ను జనరల్ డ్రగ్ కంట్రోల్ డైరెక్టరేట్ సీజ్ చేసింది. ఖతార్ సముద్ర సరిహద్దుల గుండా సుమారు 100 కిలోల నార్కోటిక్ హషీష్ అక్రమంగా రవాణా చేస్తుండగా అడ్డుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
డ్రగ్స్ రహిత సమాజం కోసం నిరంతరం తమ ప్రయత్నాలు కొనసాగుతాయని పేర్కొంది. సమాజంలో చీడ పురుగులా విస్తరిస్తున్న డ్రగ్ మహమ్మారిని అరికట్టేందుకు పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఏదైనా డ్రగ్ సంబంధిత సమాచారాన్ని తెలియజేసి, సహకరించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!
- కువైట్ లో భద్రతా సంసిద్ధత, కార్యచరణపై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో గ్రాండ్ దీపావళి గాలా..!!
- MTCIT బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డు 3వ ఎడిషన్ ప్రారంభం..!!