ఇరాన్ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు
- February 28, 2026
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.మిడిల్ ఈస్ట్ లోని అన్ని గమ్యస్థానాలకు తమ విమాన సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యలు ప్రారంభించడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇవాళ ఇరాన్ పై సమన్వయంతో దాడులు ప్రారంభించాయి.ఈ పరిణామంతో మిడిల్ ఈస్ట్ లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ మరింత విస్తరిస్తే సుదూర భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ముందు జాగ్రత్త చర్యగా విమానాలను రద్దు చేసింది.
“మిడిల్ ఈస్ట్ లోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.అందుకే అన్ని విమానాలను నిలిపివేస్తున్నాం. భద్రతా వాతావరణాన్ని నిరంతరం అంచనా వేస్తూ, అవసరమైన మేరకు మా ఆపరేషన్లను సర్దుబాటు చేస్తాం” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభావితమైన ప్రయాణికులకు తమ బృందాలు అన్ని విధాలా సహకరిస్తాయని హామీ ఇచ్చింది.ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తన సర్వీసుల పై కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ రీజియన్‌లోని పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ దేశాలకు వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







