నూతన చీఫ్ సెక్రటరీ వారికి శ్రీ కనక దుర్గమ్మ ఆశీస్సులు
- February 28, 2026
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు స్వీకరించిన జి.సాయి ప్రసాద్ కి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (కనకదుర్గమ్మ ఆలయం) తరపున అర్చకులు అమ్మవారి ఆశీస్సులు అందజేశారు.
ఈరోజు ఉదయం ఏపీ సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా, ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనా నాయక్ నేతృత్వంలోని అర్చక బృందం ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆలయ స్థానాచార్య వి.శివ ప్రసాద్ శర్మ మరియు ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో అర్చక బృందం నూతన సీఎస్‌కు వేద మంత్రోచ్ఛారణలతో ఆశీస్సులు అందజేశారు.
ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ శ్రీ కనకదుర్గ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదంతో పాటు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి, శ్రీ అమ్మ వారి కృపాకటాక్షాలుతో రాష్ట్ర అభివృద్ధిలో సాయి ప్రసాద్ వారి సేవలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆలయ వేద పండితులు, అర్చకులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







