పుష్కర యాప్‌ను ప్రారంభించనున్న చంద్రబాబు

- July 17, 2016 , by Maagulf
పుష్కర యాప్‌ను ప్రారంభించనున్న చంద్రబాబు

తెలుగువాళ్ళు ఎక్కడ ఉన్నా కృష్ణా పుష్కరాల సమాచారాన్ని, విశిష్టతను, నిర్వహణ తీరు తెన్నులను తెలుసుకునేందుకు వీలుగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందిస్తోంది. జిల్లా యంత్రాంగం అందించే సేవలు, ఏర్పాట్లు, జిల్లా చరిత్ర, విశేషాలు, ఘాట్ల వివరాలు, పూజలు, దర్శనీయ ప్రాంతాల సమస్త సమాచార వాహినిగా ఈ వైబ్‌సైట్‌ను రూపొందిస్తున్నారు. కలెక్టర్‌ బాబు ఈ వైబ్‌సైట్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ మార్పులు, చేర్పులు చేయిస్తున్నారు. దీంతో పాటు కృష్ణా పుష్కరాలకు సంబంధించి మొబైల్‌ యాప్‌ను కూడా రూపొందిస్తున్నారు. మొబైల్‌ యాప్‌లో సమస్త సమాచారాన్ని అందిస్తున్నారు. ఈ నెల 18వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుష్కర వెబ్‌సైట్‌ను, మొబైల్‌ యాప్‌లను ఆవిష్కరించనున్నారు. కృష్ణా పుష్కరాలకు సంబంధించి రూపొందించిన పాటల సీడీని కూడా ఇదే సందర్భంలో ఆవిష్కరించనున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com