గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్.. ఖండించిన 31 అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- August 16, 2025
దోహా: ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్ ప్రకటనను 31 అరబ్, ఇస్లామిక్ దేశాలు ఖండించాయి. వీటితోపాటు అరబ్ లీగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ సెక్రటరీ జనరల్‌లు కూడా ఇజ్రాయెల్ వ్యాఖ్యలను ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్ట నియమాలను , అంతర్జాతీయ సంబంధాల పునాదులను తీవ్రంగా ఉల్లంఘించడమేనని.. ఇజ్రాయెల్ ధోరణి అరబ్ జాతీయ భద్రత, సార్వభౌమాధికారం మరియు ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతికి ప్రత్యక్ష ముప్పుగా పరిణమిస్తుందని స్పష్టం చేశాయి.
జూన్ 4, 1967న నాటి ఒప్పందం ప్రకారం..ఆక్రమిత జెరూసలేం రాజధానిగా పాలస్తీనా ప్రజలు తమ స్వతంత్ర, సార్వభౌమ రాజ్యాన్ని స్థాపించుకునే అవకాశం కల్పించాలని పిలుపునిచ్చారు. ఆక్రమిత పాలస్తీనా భూభాగాలపై ఇజ్రాయెల్‌కు సార్వభౌమాధికారం లేదని స్పష్టం చేశాయి. గాజా స్ట్రిప్ ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో అంతర్భాగమని చెప్పాయి. అంతర్జాతీయ మద్దతుతో పాలస్తీనా ను ఏర్పాటు చేయాలని కోరాయి. అమెరికా, భద్రతా మండలి ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై కొనసాగుతున్న దురాక్రమణను అడ్డుకోవాలని, శాంతియుత పద్ధతుల్లో పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చాయి.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..