రియాద్ లో 84 సంస్థలు మూసివేత..!!
- August 17, 2025
రియాద్ః రియాద్ మేయరాల్టీ మన్ఫుహా పరిసరాల్లో ఇంటెన్సివ్ తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 84 సంస్థలను మూసివేసింది. అదే సమయంలో మేయాల్టీ 531 నోటీసులను జారీ చేసింది. 11 సైట్లకు విద్యుత్ సరఫరాను డిస్కనెక్ట్ చేసింది. 5,322 కిలోల ఆహార పదార్థాలు మరియు 25 కిలోల పొగాకు ఉత్పత్తులను డెస్ట్రాయ్ చేయడంతో పాటు, మానవ వినియోగానికి పనికిరాని 31,620 ఉత్పత్తులను సీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. తనిఖీల సందర్భంగా మొత్తం పదహారు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ఆహార భద్రత మరియు ఉత్పత్తి నాణ్యతను ప్రభావితం చేసే ఉల్లంఘనలకు సంబంధించి మేరియాల్టీ తన "మాడినాటి" యాప్ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఆహార సంస్థలు, మాంసం షాపులు, కేఫ్ తదితర సంస్థలలో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు. "మాడినాటి" యాప్ ద్వారా ఉల్లంఘనలను నివేదించడం ద్వారా సహకరించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







