డాలస్‌లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- August 17, 2025 , by Maagulf
డాలస్‌లో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

డాలస్‌లో మహాత్మా గాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.

మహాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా.తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ...
“మన దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సమరయోధుల త్యాగం ఎప్పటికీ మరువలేనిది. గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి మహనీయుల కృషి ఎన్నటికీ కొనియాడదగినదే” అని అన్నారు.

శుక్రవారం పనిరోజు అయినప్పటికీ, ఉదయం వేళ పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు హాజరుకావడం వారి మాతృదేశభక్తికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. అనంతరం అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తెనాలి డబుల్ హార్స్ వారు ఇండియా నుంచి పంపిన సున్నిండలు ఉండగా, వాటిని ఆస్వాదిస్తూ అందరి ముఖాల్లో ఆనందభావాలు కనబడ్డాయి.

బోర్డు సభ్యులు రాజీవ్ కామత్, మహేందర్ రావు, రాజేంద్ర వంకావాల, తిరుమల్ రెడ్డి కుంభం, జస్టిన్ వర్గీస్, భారతి మిశ్రా, కళయ్ కృష్ణమూర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com