తల్లి వేధింపులు: బాలికకు దుబాయ్‌ పోలీసుల అండ

- July 17, 2016 , by Maagulf
తల్లి వేధింపులు: బాలికకు దుబాయ్‌ పోలీసుల అండ
తల్లి వేధింపుల నుండి 12 ఏళ్ళ బాలికకు దుబాయ్‌ పోలీసులు విముక్తి కల్పించారు. ఆ బాలిక నుంచి ఫోన్‌ కాల్‌ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు క్యుసైస్‌ పోలీసు - విక్టిమ్‌ కేర్‌ డిపార్ట్‌మెంట్‌ వెంటనే స్పందించింది. క్యుసైప్‌ పోలీస్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ కల్నల్‌ అహ్మద్‌ తని బిన్‌ ఘలితా మాట్లాడుతూ, తమ డిపార్ట్‌మెంట్‌ పిల్లల్ని వేధిస్తున్న నాలుగు కేసుల్ని టాకిల్‌ చేసినట్లుగా వెల్లడించారు. ఇందులో జాహిర్‌ కేసు కూడా ఒకటి. బాధితురాల్ని విక్టిమ్‌ కేర్‌ ఎంప్లాయీ, దుబాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌కి తరలించారు. బాధితురాలి తల్లి పలు కేసుల్లో వాంటెడ్‌గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు, తనను డ్రైవర్‌ లైంగికంగా వేధించినట్లు తొలుత పేర్కొంది. అయితే ఆ తర్వాత ఆమే స్వయంగా ఆ ఆరోపణల్ని ఖండించింది. బాధితురాలు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉందని వైద్యులు పేర్కొన్నారు. 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com