అల్-షఖౌరా మర్డర్ కేసులో నిందితుడికి మరణశిక్ష..!!
- August 18, 2025
మనామాః బహ్రెయిన్ లోని అల్-షఖౌరాలో మర్డర్ కేసులో దోషిగా తేలిన నిందితుడిని ఎగ్జామిన్ చేసిన వైద్య కమిటీ మెంబర్స్ నుండి హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ వాంగ్మూలాన్ని నమోదు చేసింది. నేరం జరిగిన సమయంలో నిందితుడు పూర్తి స్పృహలో ఉన్నాడని, అన్ని తెలిసే మర్డర్ కు ప్లాన్ చేశాడని నిపుణులు తెలిపారు.మొదటి హై క్రిమినల్ కోర్ట్ గతంలో జారీ చేసిన మరణశిక్షను ఖరారు చేయాలని కోర్టును కోరారు.
గతంలో నిందితుడికి మానసిక సమస్యలు ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా హత్యకు ప్లాన్ చేశాడని, హత్య ఆయుధాన్ని సిద్ధం చేసుకున్నాడని, దానిని తన దుస్తులలో దాచాడని, చేతి గ్లవుస్ ధరించాడని మరియు తరువాత కత్తిని పారవేసాడని ప్యానెల్ కోర్టుకు వివరించింది.
కాగా, మొదటి హై క్రిమినల్ కోర్టు గతంలో నిందితుడు హత్యకు పాల్పడినట్లు నిర్ధారించింది. స్పష్టమైన ఆధారాలు ఉండటంతో ఏకగ్రీవ నిర్ణయంతో అతనికి మరణశిక్షను విధించింది.
తాజా వార్తలు
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్‌కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్‌లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!







