సౌదీ అరేబియాలోని ఆరు రీజియన్లలో క్లౌడ్ సీడింగ్..!!
- August 18, 2025
రియాద్ః సౌదీ అరేబియాలోని ఆరు రీజియన్లలో క్లౌడ్ సీడింగ్ చేపట్టనున్నారు. ప్రస్తుతం అల్-బహా, అసిర్లతో పాటు రియాద్, ఖాసిమ్, హైల్, మక్కా వంటి ఆరు ప్రధాన ప్రాంతాలలో క్లౌడ్ సీడింగ్ కార్యకలాపాలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
క్లౌడ్ సీడింగ్ టెక్నాలజీని నిర్దిష్ట ప్రాంతాలలో వర్షపాతాన్ని కురిపించడానికి ఉపయోగిస్తారు.
సౌదీ అరేబియా కింగ్డమ్ విజన్ 2030 లక్ష్యాలలో భాగంగా క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి మొహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించిన మిడిల్ ఈస్ట్ గ్రీన్ సమ్మిట్ ఫలితాలలో ఒకటిగా ప్రాంతీయ క్లౌడ్ సీడింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఎడారీకరణ మరియు కరువుకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంతపాటు వృక్షసంపదను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. రియాద్, హైల్ మరియు ఖాసిమ్ ప్రాంతాలలో ఈ కార్యక్రమం ఆపరేషన్ ఇప్పటికే ప్రారంభమైందని క్లౌడ్ సీడింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ అయ్మాన్ అల్-బార్ తెలిపారు. సౌదీ అరేబియాలో 1986 లో మొదటి క్లౌడ్ సీడింగ్ ప్రయోగం ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ
- లోక్ భవన్లో ఉత్తరప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ & డామన్ మరియు డయ్యూ ఆవిర్భావ దినోత్సవం
- వణికిపోతున్న అమెరికా..15 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ
- స్పేస్కు వెళ్లినప్పుడు ఒక కొత్త విషయం కనిపించింది: సునితా విలియమ్స్
- అమెరికాలో నలుగురు భారత సంతతి వ్యక్తుల హత్య
- కువైట్ లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!







