రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్

- July 17, 2016 , by Maagulf
రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్

గుర్తుతెలియని హ్యాకర్లు రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ చేసి రెండు మిలియన్‌ల నెటిజన్ల డేటాను లీక్ చేశారు. ఈ హ్యాకింగ్ తో ముస్లిమ్ మ్యాచ్ డాట్ కాం, షాదీ డాట్ కాం వెబ్‌సైట్ లు ప్రభావితమయ్యాయి. రెండు మిలియన్ యూజర్ల డేటాతో పాటు వారి ఈమెయిల్ అడ్రసులు, వారి పాస్ వర్డ్ లను హ్యాకర్లు తస్కరించారు. 1,50,000 మంది నెటిజన్ల సమాచారంతోపాటు 7,90,000 ప్రైవేటు మెసేజ్ ల డేటాను ఆన్ లైన్ లో లీక్ చేశామని హ్యాకర్లు ప్రకటించారు. దీంతోపాటు ఆఫ్రికా డేటింగ్ డాట్ కాం, అడల్ట్ సింగిల్ సైట్స్ డాట్ కాంలు హ్యాకింగ్ చేశారు. ఈ హ్యాకింగ్ వ్యవహారంలో చిక్కుకున్న వినియోగదారులు తమ పాస్ వర్డ్ లను వెంటనే మార్చుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు. నెటిజన్లు తమ అకౌంట్లకు సమయానుకూలంగా పాస్ వర్డ్ లను మార్చుకోవడంతోపాటు టూ స్టెప్ అథంటికేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవాలని సైబర్ నిపుణులు సలహా ఇచ్చారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com