అబుదాబిలో నవజాత శిశువుల జన్యు పరీక్షలు ప్రారంభం..!!
- August 18, 2025
యూఏఈ: అబుదాబి ఆరోగ్య మంత్రిత్వశాఖ నవజాత శిశువుల జన్యు పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన కార్యక్రమాలలో దీనిని ఒకటిగా భావిస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 815 కి పైగా చికిత్స చేయగల జన్యు సంబంధిత జబ్బుల కోసం నవజాత శిశువులను పరీక్షిస్తారు. వీటిలో జీవక్రియలో సమస్యలు, రోగనిరోధక శక్తి లోపాలు, రక్త సంబంధిత జబ్బులు, వెన్నెముక కండరాల సమస్యలు వంటి అరుదైన జెనటిక్ సంబంధిత వ్యాధులను ముందుగానే తెలుసుకుంటారు.
నవజాత శిశువు తల్లిదండ్రుల సమ్మతితో, వైద్యులు పుట్టిన సమయంలో బొడ్డుతాడు నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షిస్తారు. దీని ద్వారా జన్యుపరమైన పరిస్థితులను ముందుగానే గుర్తించవచ్చని అబుదాబి ఆరోగ్య శాఖ అండర్ సెక్రటరీ డాక్టర్ నౌరా ఖామిస్ అల్ ఘైతి అన్నారు. అయితే, ప్రారంభ దశలో M42 భాగస్వామ్యంతో కనద్ హాస్పిటల్ మరియు దానత్ అల్ ఎమరాత్ హాస్పిటల్లో స్వచ్ఛందంగా స్క్రీనింగ్ అందించబడుతోందన్నారు.
తాజా వార్తలు
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!







