బహ్రెయిన్‌లో వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలు..!!
- August 18, 2025
మనామా: బహ్రెయిన్ లో ఇక వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షలు ఇక తప్పనిసరి కానున్నాయి. ప్రతినిధుల మండలిలోని సేవల కమిటీ ఈ కొత్త పార్లమెంటరీ ప్రతిపాదనను సమీక్షిస్తుంది. ముసాయిదా చట్టం ప్రకారం వివాహానికి ముందు మానసిక ఆరోగ్య, మాదకద్రవ్య వినియోగ, జన్యు మరియు అంటు వ్యాధుల పరీక్షలను చేయించుకోవాలి.
ఆరోగ్యకరమైన కుటుంబాలకు బలమైన పునాదులను వేయడం ఈ ఆరోగ్య పరీక్షల లక్ష్యమని ఈ బిల్లు ప్రధాన స్పాన్సర్లలో ఒకరైన MP బాస్మా ముబారక్ అన్నారు. సౌదీ అరేబియా అమలు చేస్తున్న ప్రీ-మ్యారేజ్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, దాదాపు 60శాతం హానికర వివాహాలను తగ్గించాయని తెలిపారు. వివాహానికి ముందు ఆరోగ్య పరీక్షల ద్వారా బహ్రెయిన్ కుటుంబాలకు బలమైన వైద్య, మానసిక మరియు సామాజిక రక్షణ లభిస్తుందని ముబారక్ అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!