అనేకమంది ప్రాణాలను కాపాడిన సౌదీ యువకుడి ధైర్యం..!!
- August 19, 2025
రియాద్: భారీ గ్యాస్ స్టేషన్ పేలుడును నివారించడం ద్వారా సౌదీ యువకుడు అనేక మంది ప్రాణాలను కపాడాడు. రియాద్ ప్రాంతంలోని అల్-దవాద్మి గవర్నరేట్‌లోని అల్-జంష్ పట్టణంలోని గ్యాస్ స్టేషన్ వద్ద గడ్డి ట్రక్కులో మొదట మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మహర్ ఫహద్ అల్-దల్బాహి అసాధారణ ధైర్యసాహసాలతో ట్రక్కు వద్దకు పరుగెత్తి, ఇంధన ట్యాంకుల నుండి దానిని దూరంగా తీసుకెళ్లాడు. దాంతో భారీ భారీ పేలుడును నివారించి, అనేక మంది ప్రాణాలను బలికొనే భారీ విస్పొటనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతనికి అనేక గాయాలు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు మహర్ ఫహద్ ధైర్య సహసాలను ప్రశంసిస్తున్నారు.
కాగా, తన గ్రామం అల్-సాలిహియాకు వెళుతుండగా గ్యాస్ స్టేషన్ సమీపంలోని దుకాణం వద్ద తన కారును ఆపిన సమయంలో ఇదంతా జరిగిందని అల్-దల్బాహి వివరించాడు. ప్రస్తుతం అతను రియాద్‌లోని కింగ్ సౌద్ మెడికల్ సిటీలో ప్రత్యేక వైద్య బృందాల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు.
తాజా వార్తలు
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో సంక్రాంతి సంబరాలు







