మీ పిల్లలు లైసెన్స్ పొందిన బస్సులోనే వెళుతున్నారా?

- August 19, 2025 , by Maagulf
మీ పిల్లలు లైసెన్స్ పొందిన బస్సులోనే వెళుతున్నారా?

మనామా: బహ్రెయిన్ లో స్కూల్ బస్సుల సేఫ్టీపై జనరల్ ట్రాఫిక్ డైరెక్టరేట్ పేరంట్స్ కు సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ చేసింది.  తమ పిల్లలను రోజు స్కూలుకు తీసుకెళ్లే బస్సుల అనుమతి పత్రాలను ఒకసారి చెక్ చేయాలని సూచించింది.  చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేని డ్రైవర్లను నియమించుకోవద్దని పిలుపునిచ్చింది.  

లైసెన్స్ లేని బస్సులను ఉపయోగించడం వల్ల ప్రయాణీకులకు రక్షణ లేకుండా పోతుందని అధికారులు హెచ్చరించారు.  అటువంటి వాహనాల లోపల ఉన్న వ్యక్తులకు బీమా కవరేజ్ వర్తించదని గుర్తుచేసింది. పిల్లలు మరియు విద్యార్థుల భద్రతను కాపాడటానికి స్కూల్ బస్సు డ్రైవర్లు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తున్నారని నిర్ధారించుకోవడం ముఖ్యమని,  తల్లిదండ్రులు వాటిని తరచూ చెక్ చేయాలని సూచించారు. 

అలాగే,  రోడ్డుపై ప్రమాదాలు లేదా బ్రేక్‌డౌన్‌లను నివారించడానికి డ్రైవర్లు వాహనం బ్రేకింగ్ మరియు భద్రతా వ్యవస్థలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని సూచించారు. పాఠశాలకు పిల్లలను వారి రోజువారీ ప్రయాణంలో సురక్షితంగా ఉంచడానికి ఈ మార్గదర్శకాలను పాటించడం చాలా అవసరమని ట్రాఫిక్ శాఖ తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com