సలాలాలోని రజాత్ రాయల్ ఫామ్‌లో టూరిస్టుల సందడి..!!
- August 19, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లోని రజాత్ రాయల్ ఫామ్ టూరిస్టులకు స్వాగతం పలుకుతోంది. టూరిస్టులకు విభిన్న వ్యవసాయ పద్ధతులు, పురాతన చెట్లు, వివిధ వ్యవసాయ ఉత్పత్తులను తెలసుకునే అవకాశాన్ని ఇది అందిస్తుంది.
టూర్ గైడ్లతో కలిసి, సందర్శకులు అనేక స్టేషన్ల ద్వారా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. ఈ సందర్భంగా వారికి వివిధ పంటలు, మొక్కలను గురించిన సమాచారాన్ని తెలియజేసారు. వివిధ కూరగాయలతో పాటు కొబ్బరి, బొప్పాయి, ద్రాక్ష, అంజూర, సీతాఫలం, ఒమానీ నిమ్మ చెట్లకు ఈ ఫామ్ నిలయంగా ఉంది. అలాగే, సుగంధ ద్రవ్యాలు మరియు అంజూర వంటి స్థానిక చెట్లు, అలాగే బావోబాబ్, జెయింట్ ఫికస్, చింతపండు వంటి పురాతన జాతులతోపాటు పసుపు, అల్లం, తులసి వంటి ఔషధ మరియు సుగంధ మొక్కలను చూడవచ్చు.
రజాత్ రాయల్ ఫామ్ సలాలా తూర్పు భాగంలోని సుల్తాన్ కబూస్ వీధిలో 1,085 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వీటిలో 900 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







