Dh100,000 గెలుచుకున్న యూఏఈ వాసి..!!
- August 21, 2025
యూఏఈ: గత ఐదు నెలలుగా యూఏఈ లాటరీ ఆడుతున్న యూఏఈ వాసిని అధృష్టం పలకరించింది. అబ్దుల్లా అలీ గరీబ్ జూన్ నెలకు సంబంధించి వన్ హండ్రెడ్ థౌజండ్స్ దిర్హామ్స్ గెలుచుకున్నారు. మొదట్లో తాను నమ్మలేదని, అనేక సార్లు తనిఖీ చేశాకే విజయం దక్కిందని నమ్మినట్లు పేర్కొన్నాడు. తాను గెలిచిన డబ్బుతో తన కారును అప్‌గ్రేడ్ చేస్తానని తెలిపాడు. తన వద్ద ఇప్పటికే ఉన్న కారును విక్రయించి కొత్త కారును తీసుకోనున్నట్లు పేర్కొన్నాడు.
జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ కఠినమైన నిబంధనలను అనుసరించి, యూఏఆ లాటరీ గత సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఇది వారం రోజులకు ఒకసారి భారీ 100-మిలియన్ దిర్హామ్స్ జాక్‌పాట్‌ను అందిస్తుంది. అలాగే సరిపోలిన అంకెల సంఖ్యను బట్టి 100 నుండి 100 మిలియన్ల దిర్హామ్స్ వరకు బహుమతులను అందిస్తుంది. గత నెలలో, ఇది నాలుగు కొత్త స్క్రాచ్‌కార్డ్‌లను ప్రారంభించింది. వీటి ద్వారా వన్ మిలియన్ దిర్హామ్స్ వరకు గెలుచుకునే అవకాశాన్ని అందిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







