ఆగస్టు 27 నుండి దుక్మ్‌లో టూరిజం హ్యాకథాన్..!!

- August 21, 2025 , by Maagulf
ఆగస్టు 27 నుండి దుక్మ్‌లో టూరిజం హ్యాకథాన్..!!

దుక్మ్: ఒమన్ లోని అల్ వుస్తా గవర్నరేట్‌లోని దుక్మ్‌లో "టూరిజం హ్యాకథాన్ 2025" ఆగస్టు 27 నుండి 31 వరకు నిర్వహించనున్నారు. ప్రైవేట్ రంగ సహకారంతో ఒమన్ హెరిటేజ్ మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్.. ఒమన్ సుల్తానేట్‌లో పర్యాటక మరియు ఆతిథ్య రంగాలను అభివృద్ధి చేయడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు.

ఇది ప్రతిభావంతులైన ఒమానీ యువతను వినూత్న మార్గాల్లో ఆలోచించడానికి, వారిలో పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి దోహద పడుతుందని భావిస్తున్నారు. ఈ హ్యాకథాన్‌లో యూనివర్సిటీలు, కాలేజీల నుండి యువ ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు, విద్యార్థులు పాల్గొని, డిజిటల్ రంగంలో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com