నకిలీ బంగారం విక్రయాలు.. విదేశీ ఆన్‌లైన్ స్టోర్ బ్లాక్..!!
- August 21, 2025
రియాద్: సౌదీ అరేబియా వెలుపల ఉండి, విశ్వసనీయత లేని ఆన్‌లైన్ స్టోర్‌ను నిర్వహిస్తున్న ఆన్ లైన్ స్టోర్ ను వాణిజ్య మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. ఇది రాగితో తయారు చేసి, బంగారం పూతతో తయారుచేసిన నకిలీ బంగారం విక్రయాలను చేస్తున్నట్లు వెల్లడించింది.
సౌదీ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ స్టోర్, మార్కెట్ విలువలో సగం ధరకే బంగారం అంటూ ప్రకటనలు ఇస్తూ..అమాయకులను మోసం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. E-కామర్స్ చట్టంలోని నిబంధనలను అనుసరించి స్టోర్‌ను వెంటనే బ్లాక్ చేసినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది.
ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసే ముందు ఆయా ఆన్‌లైన్ స్టోర్‌ల విశ్వసనీయతను ధృవీకరించుకోవాలని, మోసాల నుండి తమను తాము రక్షించుకోవడానికి తెలియని వెబ్‌సైట్‌లలో కొనుగోలుకు దూరంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







