ఏపీఎస్ఆర్టీసీ: ఇక ఏసీ బస్సులే …

- August 22, 2025 , by Maagulf
ఏపీఎస్ఆర్టీసీ: ఇక ఏసీ బస్సులే …

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత బస్ సర్వీసుల్లో 20 లక్షల మంది మహిళలలు ఈ సేవను వినియోగించుకుంటారని భావిస్తే..ఈ సంఖ్య విపరీతంగా పెరినట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ తిరుమల్ రావు వెల్లడించారు. పొన్నూరు ఆర్టీసీ డిపో లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు శుక్రవారం బహుమతులు, ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బంది మహిళలతో ఫ్రెండ్లీగా వ్యవహరించాలని, ఆర్టీసీ సిబ్బందికి సూచించారు.

ఎటువంటి గొడవలకు అవకాశం ఇవ్వవద్దని, ఈ పథకంతో ఆర్టీసీకి నష్టం రాదని బకాయిలను ప్రభుత్వం సకాలం చెల్లిస్తుందని ఆయన వివరించారు. విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులందరికీ పెన్షన్ పెరుగుతుందని, అందరికీ మంచి జరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ డీలక్స్ బస్సులు, ఎలక్ట్రికల్ బస్సులు తెస్తామని, కొత్త బస్సులు తీసుకు వచ్చి ఏసీ బస్సులుగా మారుస్తామని, అత్యధికంగా ఏసీ బస్సులే నడుపుతామన్నారు.ఈ కార్యక్రమంలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com