2024లో ఒమన్‌లో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ విలువ OMR3.3 బిలియన్లు..!!
- August 24, 2025
మస్కట్: 2024లో ఒమన్ సుల్తానేట్‌లో రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ మొత్తం విలువ OMR3.38 బిలియన్లకు చేరుకుందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) తాజా గణంకాలు వెల్లడించాయి. ఇందులో మస్కట్ గవర్నరేట్ వాణిజ్య విలువ పరంగా సుమారు OMR1.25 బిలియన్లతో గవర్నరేట్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. తరువాత నార్త్ అల్ బటినా గవర్నరేట్ OMR877.80 మిలియన్లు, అల్ దఖిలియా గవర్నరేట్ OMR380.70 మిలియన్లు, సౌత్ అల్ బటినా గవర్నరేట్ OMR359.40 మిలియన్లతో ఉన్నాయి. ధోఫర్ గవర్నరేట్ వాణిజ్య విలువ OMR216.70 మిలియన్లు, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్ వాణిజ్య విలువ OMR74 .40 మిలియన్లు, అల్ దహిరా గవర్నరేట్ వాణిజ్య విలువ OMR72.50 మిలియన్లు, నార్త్ అల్ షర్కియా గవర్నరేట్ వాణిజ్య విలువ దాదాపు OMR66.50 మిలియన్లుగా నమోదైంది. ఇతర గవర్నరేట్‌ల విషయానికొస్తే, అల్ బురైమి గవర్నరేట్‌లో వాణిజ్య విలువ దాదాపు OMR49.60 మిలియన్లు, అల్ వుస్తా గవర్నరేట్ OMR15.70 మిలియన్లు, ముసందం గవర్నరేట్ వాణిజ్య విలువ OMR12.10 మిలియన్లుగా ఉంది.
మరోవైపు, 2024 సంవత్సరంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లో భవన నిర్మాణానికి సంబంధించి 36,517 అనుమతులు జారీ చేశారు. ఇక భవన నిర్మాణ పూర్తి సర్టిఫికెట్ల సంఖ్య 41 శాతం పెరిగి 23,743కి చేరుకుంది. మొత్తంగా నివాస భవన అనుమతులు అత్యధికంగా 28,789 ఉన్నాయి
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!