31772 కిలోల బంగారం అక్రమ రవాణా
- August 24, 2025
న్యూ ఢిల్లీ: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.గతేడాది నుంచి గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. భవిష్యత్తులో ఇంకెతంకు చేరుతుందో అంచనా వేయడం సవాల్ గా మారింది.ఈ పరిస్థితుల్లో గోల్డ్ స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు.గల్ఫ్ దేశాల్లో చౌకగా దొరికే బంగారాన్ని విమానాల్లో, వివిధ మార్గాల్లో భారతదేశంలోకి తరలిస్తున్నారు.ఈ క్రమంలో దేశంలోని విమానాశ్రయాల్లో బంగారంను అక్రమంగా తరలిస్తున్న వారిని అనేకసార్లు కస్టమ్స్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలోనూ ప్రతీయేటా కోట్ల విలువైన బంగారం కస్టమ్స్ అధికారులకు పట్టుబడుతోంది. అయితే, దేశవ్యాప్తంగా గత కొన్నేళ్ల నుంచి భారీ మొత్తంలో అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772 కిలోల బంగారంను అధికారులు సీజ్ చేశారు.
దేశవ్యాప్తంగా గత పదేళ్లలో భారీగా అక్రమంగా తరలిస్తున్న బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడింది. 2015-16 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు పదేళ్లలో అక్రమంగా తరలిస్తున్న 31,772.34 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి 35,888 కేసులు నమోదు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వివరించింది. అత్యధికంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 4,971.68 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
పదేళ్లకు సంబంధించిన వివరాలు..
- 2015-16 ఆర్థిక సంవత్సరంలో 2,815 కేసులు నమోదు కాగా.. 2,972.07 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1,573 కేసులు నమోదు కాగా.. 1,520.24 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2017-18 ఆర్థిక సంవత్సరంలో 3,131 కేసులు నమోదు కాగా.. 3,329.46 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2019-19 ఆర్థిక సంవత్సరంలో 5,092 కేసులు నమోదు కాగా.. 4,292.29 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4,784 కేసులు నమోదు కాగా.. 3,626.85 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2,034 కేసులు నమోదు కాగా.. 1,944.39 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2021-22 ఆర్థిక సంవత్సరంలో 2,236 కేసులు నమోదు కాగా.. 2,172.11 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4,619 కేసులు నమోదు కాగా.. 4,342.85 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,599 కేసులు నమోదు కాగా.. 4,971.68 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
- 2024-25 ఆర్థిక సంవత్సరంలో 3,005 కేసులు నమోదు కాగా.. 2,600.40 కిలో బంగారాన్ని సీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







