ఖతార్ లో 1,019 మెడిసిన్ ధరలు తగ్గింపు..!!
- August 26, 2025
దోహా: ఖతార్ స్థానిక మార్కెట్లో 1,019 ఔషధ ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MoPH) ప్రకటించింది. వీటిపై 15 శాతం నుండి 75 శాతం వరకు తగ్గింపులు ఉన్నాయి. గుండె, రక్తపోటు, మధుమేహం, నొప్పి నివారణ, క్యాన్సర్ చికిత్సలు, యాంటీబయాటిక్స్, అలెర్జీ చికిత్సలు, యాంటిడిప్రెసెంట్స్, మానసిక మందులు, జీర్ణశయా సంబంధిత మందులు, బరువు తగ్గించే మందులు వంటి అనేక రకాల మెడిసిన్స్ ధరలు తగ్గాయని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖలోని ఫార్మసీ మరియు డ్రగ్ కంట్రోల్ విభాగం డైరెక్టర్ డాక్టర్ ఐషా ఇబ్రహీం అల్ అన్సారీ తెలిపారు. ఖతార్ లో నమోదైన ఔషధ ఉత్పత్తుల ధరలను ఫార్మసీ మరియు డ్రగ్ కంట్రోల్ విభాగం క్రమం తప్పకుండా సమీక్షిస్తుందన్నారు. మెడిసిన్ జాబితా మరియు వాటి ధరల కోసం ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







