బహ్రెయిన్ పాఠశాలల్లో తల్లిదండ్రుల ప్రవేశ దినోత్సవం..!!
- August 26, 2025
మనామా: బహ్రెయిన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో "తల్లిదండ్రుల ప్రవేశ దినోత్సవం"ను నిర్వహించాలని విద్యా మంత్రిత్వ శాఖను డిప్యూటీ కింగ్, హిజ్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం గురించి తల్లిదండ్రులు మరియు సంరక్షకులకు తెలియజేయడంతోపాటు విద్యార్థులకు సహాయక వాతావరణాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఆయన అధ్యక్షతన గుదైబియా ప్యాలెస్‌లో క్యాబినెట్ సమావేశం జరిగింది.
హిజ్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఇటీవల ఒమన్ పర్యటన, హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ అల్-సయీద్‌తో ఆయన సమావేశం ప్రాముఖ్యతను క్యాబినెట్ సభ్యులకు వివరించారు.
సుప్రీం కౌన్సిల్ ఫర్ ఉమెన్ (SCW) 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, కౌన్సిల్ సాధించిన విజయాలను మరియు పురోగతి, అభివృద్ధిలో బహ్రెయిన్ మహిళలు కీలక పాత్రను క్యాబినెట్ ప్రశంసించింది. హిజ్ మెజెస్టి ది కింగ్ భార్య, SCW అధ్యక్షురాలు ప్రిన్సెస్ సబీకా బింట్ ఇబ్రహీం అల్ ఖలీఫాను మద్దతు కారణంగానే ఇది సాధ్యమైందని ప్రశంసలు కురిపించారు.
రాబోయే GCC మంత్రివర్గ మండలి ఎజెండాపై నివేదికలను, అలాగే వ్యాపార మరియు ప్రజా సేవలకు మద్దతు ఇవ్వడంలో మెరుగైన సామర్థ్యాన్ని చూపించిన సిజిలాత్, తవాసుల్ మరియు బెనాయత్ వంటి ప్రభుత్వ వ్యవస్థల పనితీరును క్యాబినెట్ సమీక్షించింది. తూర్పు మధ్యధరా ప్రాంతం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ ఇటీవల బహ్రెయిన్ పర్యటనకు సంబంధించిన అప్డేట్ లతో క్యాబినెట్ సమావేశం ముగిసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







