అమెరికాలో భారతీయ ట్రక్కు డ్రైవర్లకు వీసా కష్టాలు
- August 26, 2025_1756201959.jpg)
అమెరికాలో ట్రక్కు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్న భారతీయ డ్రైవర్లకు వీసా కష్టాలు ఎదురవుతున్నాయి. కొత్త వీసాల జారీ నిలిచి పోవడంతో పాటు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) ల జారీ కూబి అక్కడి ప్రభుత్వం ఆపేసింది. ఇందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జారీ చేసిన ఆదేశాలే కారణమని ట్రక్కు డ్రైవర్లు వాపోతున్నారు. ఫ్లోరిడాలో ఇటీవల ఓ భారతీయ ట్రక్కు డ్రైవర్ రాంగ్ యూటర్న్ తీసుకుంటూ ప్రమాదానికి కారణమయ్యాడు.
ముగ్గురి మృతిలో ఆగిపోయిన వీసాలు
సిగ్నల్ లేకున్నా యూటర్న్ తీసుకోవడంతో వెనకే వేగంగా వచ్చిన కారు సదరు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అమెరికన్లు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. దీంతో అమెరికా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీరియస్ గా స్పందించారు. డ్రైవర్లకు వర్క్ వీసాలతో పాటు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ల జారీని నిలివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికాలో మోటార్ వాహన రంగంలో స్థిరపడాలని కలలు కనే వేలాది మంది భారతీయులకు శాపంగా మారింది.
పంజాబ్ యువతకు చేజారీన అవకాశాలు
అమెరికాలో హెవీ ట్రక్కు డ్రైవర్లకు పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తారు. దీంతో భారత్లోని పంజాబ్(Punjab) నుంచి యువత ఎక్కువగా అక్కడికి వెళ్లి డ్రైవర్లుగా స్థిరపడుతున్నారు. అక్కడి విదేశీ ట్రక్కు డ్రైవర్లలో భారతీయ సిక్కుల సంఖ్యే ఎక్కువ. పంజాబ్లో పాటు హర్యానా నుంచి పెద్ద సంఖ్య వెళుతుంటారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఆంక్షలు అక్కడి ట్రక్కు డ్రైవర్లఓ పాటు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ డ్రైవర్లకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే, అమెరికాలో ట్రక్కు డ్రైవర్ల కొతర తీవ్రంగా ఉండడంతో ట్రంప్ ఆంక్షలు ఎక్కువ కాలం ఉండవని అమెరికా ట్రాన్స్ పోర్ట్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి విదేశీయుల పట్ల కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఫస్ట్ అమెరికన్ పీపుల్ అంటూ విదేశీయుల రోజుకో నిబంధనలను పెడుతున్నారు. విదేశీయుల వీసాలపై కఠిన నిబంధనలు తెచ్చారు. సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, లైక్ లు కొట్టినా సరే వారిపై ఏమాత్రం దయ చూపకుండా వెంటనే అమెరికాను విడిచిపెట్టె చర్యలకు పాల్పడుతున్నారు.
భారతీయ ట్రక్కు డ్రైవర్లకు అమెరికాలో వీసా సమస్యలు ఎందుకు వచ్చాయి?
ఓ భారతీయ డ్రైవర్ తప్పుగా యూ-టర్న్ తీసుకోవడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అమెరికన్లు చనిపోవడంతో, ట్రంప్ ప్రభుత్వం వీసాలు మరియు కమర్షియల్ లైసెన్సుల జారీని నిలిపివేసింది.
తాజా వార్తలు
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్