షుగర్ కంట్రోల్లో ఉండటం లేదా..అయితే ఇలా నడవండి..

- August 26, 2025 , by Maagulf
షుగర్ కంట్రోల్లో ఉండటం లేదా..అయితే ఇలా నడవండి..

ప్రస్తుతం కాలంలో చాలా మంది టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఇది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. శరీరంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవల్స్ పెరిగిపోతాయి. అయితే, షుగర్ పరిష్కారానికి ప్రధానమైన మెడిసిన్ గా నడకను చెప్తారు. నడక వల్ల షుగర్ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది. దీనిని వైద్యులు సైతం సూచిస్తారు. కాబట్టి, నడక ఎలా బ్లడ్ షుగర్(Diabetes) లెవల్స్‌ను తగ్గించడంలో సహాయపడుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

నడక ఎలా పని చేస్తుంది?
నడక సమయంలో శరీరానికి ఆక్సిజన్ అవసరం పెరుగుతుంది. దీని వల్ల శరీరంలోని కండరాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. కాబట్టి, కండరాలు గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకోవడం మొదలుపెడతాయి. ఫలితంగా రక్తంలోని షుగర్ స్థాయులు తగ్గుతాయి, ఇన్సులిన్ సున్నితత్వం మెరుగవుతుంది.

ఎప్పుడు నడవాలి?
పలు అధ్యయనాల ప్రకారం, భోజనం తర్వాత 30 నిమిషాల్లో 10 నుంచి 15 నిమిషాలు నడవడం బ్లడ్ షుగర్ లెవల్స్‌ను గణనీయంగా తగ్గుతాయట. ముఖ్యంగా అల్పాహారం తర్వాత 15 నిమిషాలు, మద్యాహ్న భోజనం తర్వాత 15 నుంచి 20 నిమిషాలు, రాత్రి భోజనం తర్వాత 20 నిమిషాలు నడవాలి. ఇలా రోజుకు మొత్తం 45 నుంచి 60 నిమిషాల నడక వల్ల షుగర్ చాలా వరకు కంట్రోల్ లో ఉంటుంది.

నడక వల్ల కలిగే ఇతర లాభాలు:
బరువు తగ్గుతుంది: తద్వారా షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి.
హార్ట్ ఆరోగ్యం మెరుగవుతుంది: రక్తనాళాల్లో గడ్డకట్టిన షుగర్ తగ్గుతుంది.
మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది: నడక మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు నిద్రను మెరుగుపరుస్తుంది.
పాదాల ఆరోగ్యం మెరుగవుతుంది: డయాబెటిక్ న్యూరోపతీని తగ్గించడంలో సహాయపడుతుంది.

జాగ్రత్తలు తీసుకోవాల్సినవి:
నడకకు ముందు, తర్వాత షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవాలి.
తక్కువ షుగర్ ఉన్నవారు శక్తివంతమైన ఆహారం తీసుకున్న తర్వాత మాత్రమే నడవాలి.
పాదాల సురక్షితంగా ఉండేందుకు షూస్ వాడాలి.
గుండె సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచన మేరకు నడవడం మంచిది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com