హ్యాపీ గణేష్ చతుర్థి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో కావాలా?

- August 26, 2025 , by Maagulf
హ్యాపీ గణేష్ చతుర్థి 2025.. వాట్సాప్ స్టేటస్ వీడియో కావాలా?

గణేష్ చతుర్థి పండగ వచ్చేస్తోంది. గణేశుడి 9 నవరాత్రులు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్రలో గణేశుడి నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి.

ప్రతి ఏడాదిలా ఈ ఏడాది కూడా గణేష్ చతుర్థి ఆగస్టు 26, 27 ఆగస్టు 2025 తేదీలలో వస్తుంది. కానీ, పండుగ కేవలం ఆచారాల కోసం మాత్రమే కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆన్‌లైన్‌లో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఈ పండుగ సందర్భంగా చాలా మంది ఇప్పుడు గణపతి బప్పా వాట్సాప్ స్టేటస్ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పండుగ వాతావరణం మొదలైంది. మీరు కూడా గణేశుడి ఫొటోలు, వీడియోలతో పోస్టు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది మీకోసమే.. గణేష్ చతుర్థి 2025 స్టేటస్ క్లిప్‌లను డౌన్‌లోడ్ చేసి షేర్ చేసేందుకు అనేక మార్గాలు ఉన్నాయి అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

యూట్యూబ్ నుంచి వీడియో డౌన్‌లోడ్ చేయండిలా:

  • ఫెస్టివల్ వీడియోల కోసం యూట్యూబ్‌లో సెర్చ్ చేయొచ్చు.
  • యూట్యూబ్ ఓపెన్ చేసి “Happy Ganesh Chaturthi 2025 WhatsApp Status Video Download” అని సెర్చ్ చేయండి.
  • మీ వైబ్‌కి సరిపోయే వీడియోను ఎంచుకుని దాని లింక్‌ను కాపీ చేయండి.
  • ఏదైనా యూట్యూబ్ డౌన్‌లోడర్ టూల్ (వెబ్‌సైట్ లేదా యాప్) ఉపయోగించండి.
  • ఆ లింక్‌ అందులో ఎంటర్ చేసి ఆపై MP4 ఫార్మాట్‌ను ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • సేవ్ చేశాక వాట్సాప్ స్టేటస్‌గా వీడియోను ఇన్‌స్టంట్ అప్‌లోడ్ చేయొచ్చు.

ఇతర వెబ్‌సైట్ల నుంచి డౌన్‌లోడ్ ఎలా?
యూట్యూబ్ మాత్రమే కాదు.. ఫెస్టివల్ క్లిప్‌లను ఫ్రీగా అందించే అనేక వెబ్‌సైట్‌లు ఉన్నాయి. గూగుల్‌లో ‘Happy Ganesh Chaturthi 2025 WhatsApp Status Video Download’ అని సెర్చ్ చేయండి.

Pexels, Pixabay, Pinterest, లేదా Unsplash వంటి వెబ్‌సైట్‌లలో అద్భుతమైన వీడియోలు, పండుగ డిజైన్‌లు ఉంటాయి. మీకు ఇష్టమైనదాన్ని MP4 వీడియో ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు వాట్సాప్‌లో మాత్రమే కాకుండా, Instagram, Facebookలో కూడా షేర్ చేయవచ్చు. అలాగే, మీ ప్రియమైనవారికి నేరుగా పంపుకోవచ్చు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com