న్యూఢిల్లీలో ఇండియా-కువైట్ సమావేశం..పలు అంశాలపై చర్చ..!!

- August 27, 2025 , by Maagulf
న్యూఢిల్లీలో ఇండియా-కువైట్ సమావేశం..పలు అంశాలపై చర్చ..!!

కువైట్: భారత్ -కువైట్ విదేశాంగ కార్యాలయ 7వ రౌండ్ సంప్రదింపుల సమావేశం మంగళవారం న్యూఢిల్లీలో జరిగింది.  దీనికి విదేశాంగ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ ఆర్. మహాజన్ మరియు కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆసియా వ్యవహారాల సహాయ విదేశాంగ మంత్రి గౌరవ రాయబారి సమీహ్ ఎస్సా జోహార్ హయత్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఇరుపక్షాలు ద్వైపాక్షిక సంబంధాలను సమగ్రంగా సమీక్షించారు. పలు ప్రాంతీయ ,  అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. రాజకీయ సహకారం, వాణిజ్యం మరియు పెట్టుబడి, రక్షణ, ఇంధనం, సంస్కృతి ,ప్రజల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేలా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి ఇరుపక్షాలు నిర్ణయించాయి.

2024 డిసెంబర్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్ పర్యటన సందర్భంగా రూపొందించిన రోడ్‌మ్యాప్ అమలును కొనసాగించాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. పరస్పరం అనుకూలమైన తేదీలలో జాయింట్ కమిషన్ ఫర్ కోఆపరేషన్ కింద జాయింట్ వర్కింగ్ గ్రూపుల సమావేశాలను ఏర్పాటు చేయాలని అంగీకరించారు.

కాగా, భారత్- కువైట్ చారిత్రక సంబంధాలను కలిగి ఉన్నాయి.  ద్వైపాక్షిక వాణిజ్యం 2024–2025 ఆర్థిక సంవత్సరంలో USD 10.2 బిలియన్లుగా నమోదైంది. కువైట్‌లో పది లక్షలకు పైగా భారతీయులు నివసిస్తున్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com