హమద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డ్రగ్ పట్టివేత..!!
- August 27, 2025
దోహా: హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA)లోని కస్టమ్స్ అధికారులు డ్రగ్ స్మగ్లింగ్ ను అడ్డుకున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలలో దాచిపెట్టి ఖతార్లోకి హెరాయిన్ అక్రమ రవాణా ప్రయత్నాన్ని చాకచక్యంగా విఫలం చేశారు.వచ్చిన ప్రయాణికుడి లగేజీపై అధికారులకు అనుమానం రావడంతో.. ప్రత్యేక స్కానింగ్ పరికరాలను ఉపయోగించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అతని సూట్‌కేస్ మెటల్ ఫ్రేమ్ లోపల దాచిన అనేక హెరాయిన్ ప్యాకేజీలు బయటపడ్డాయి. అతని ల్యాప్‌టాప్, స్పీకర్లు మరియు హెయిర్ బ్లోవర్ లోపల మరిన్ని ప్యాకేజీలను గుర్తించారు. వీటిని బ్లాక్ టేప్‌తో చుట్టి ఎలక్ట్రానిక్ పరికరాలలో దాచిపెట్టారు. మొత్తం 520 గ్రాముల బరువున్న మొత్తం 13 హెరాయిన్ ప్యాకేజీలను గుర్తించినట్లు కస్టమ్స్ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







