బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2.7% పెరుగుదల..!!
- August 28, 2025
మనామా: బహ్రెయిన్ ఆర్థిక వ్యవస్థ 2025లో 2.7 శాతం, 2026లో 3.3 శాతం వృద్ధి చెందుతుందని అరబ్ మానిటరీ ఫండ్ తెలిపింది. చమురుయేతర కార్యకలాపాలు ప్రధాన భూమిక వహిస్తాయని పేర్కొన్నారు. పర్యాటకం, టెలికాం, పరిశ్రమ, గృహనిర్మాణం, విద్య మరియు క్రీడలలో $30 బిలియన్లకు పైగా ప్రాజెక్టులతో ఆర్థిక పునరుద్ధరణ ప్రణాళికలు అమలు ఫలితాలను ఇచ్చాయని పేర్కొన్నారు.
బహ్రెయిన్ GDPలో ICT, లాజిస్టిక్స్ మరియు ఆర్థిక సేవల వాటాను పెంచడానికి జాతీయ వ్యూహాలను అమలు కూడా దోహదం చేసిందన్నారు. చమురు, అల్యూమినియం మరియు పర్యాటక రంగం నుండి వచ్చే విదేశీ కరెన్సీ మద్దతుతో కరెంట్ అకౌంట్ ఆరోగ్యకరమైన స్థితిలో ఉందని తెలిపింది.
అరబ్ వరల్డ్ అంతటా వృద్ధి 2024లో 2.2 శాతం నుండి 2025లో 3.8 శాతం మరియు 2026లో 4.3 శాతంగా అంచనా వేశారు. ద్రవ్యోల్బణం ఈ సంవత్సరం 31.9 శాతం నుండి వచ్చే ఏడాది 20.8 శాతానికి మరియు 2026లో 14.2 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. చమురుయేతర రంగాల సహాయంతో గల్ఫ్ దేశాలు 2024లో 2.2 శాతం తర్వాత, 2025లో 4.0 శాతం మరియు 2026లో 4.4 శాతం వృద్ధిని సాధిస్తాయని నివేదికలో అంచనా వేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







