54 సంస్థలను సీజ్ చేసిన డ్రగ్ అథారిటీ..!!
- August 28, 2025_1756378360.jpg)
రియాద్: సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) జూలై నెలలో సుమారు 6,000 తనిఖీలు నిర్వహించింది. దాని పర్యవేక్షణలో 4,600 కంటే ఎక్కువ సౌకర్యాలలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 1,137 ఉల్లంఘనలు నమోదు చేసి, ఆయా ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 54 సంస్థలను మూసివేయించారు. దీంతోపాటు 52 ఉత్పత్తి లైన్లను సస్పెండ్ చేశారు. విశ్లేషణ కోసం సుమారు 1,000 నమూనాలను సేకరించారు.
ప్రయోగశాల పరీక్షల్లో ఆహార విషప్రయోగానికి ప్రధాన కారణమైన సాల్మొనెల్లా బ్యాక్టీరియాతో కలుషితమైందని తేలింది. అనంతరం 40 టన్నుల పౌల్ట్రీ ఉత్పత్తులను సౌదీ అరేబియాలోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. పౌరులు, నివాసితులు అథారిటీకి సహకరించాలని, ఏవైనా ఉల్లంఘనలు లేదా అతిక్రమణలను 19999 నంబర్ ద్వారా నివేదించాలని డ్రగ్ అథారిటీ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- టీటీడీ ఆసుపత్రుల డైరెక్టర్లతో అదనపు ఈవో సమీక్ష
- ఢిల్లీ చేరుకున్న సీఏం చంద్రబాబు
- ఏపీ, తెలంగాణలోని రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్..
- భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్థాన్ కెప్టెన్ ఔట్..!
- ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
- సోనియా గాంధీకి కోర్టులో ఊరట
- నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మన్ సింగ్ ఎంపిక
- అమీర్ కు ఫోన్ చేసిన భారత ప్రధాన మంత్రి..!!
- బహ్రెయిన్ సెక్యూరిటీ చీఫ్ ను కలిసిన టర్కిష్ రాయబారి..!!
- మిలియనీర్లకు నిలయంగా దుబాయ్..!!