సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం
- August 29, 2025
హైదరాబాద్: తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారిగా బిగ్ బాస్ సరికొత్త ప్రయోగం చేయబోతోంది. ఒకే ఇంటిలో కాకుండా, రెండు ఇళ్లలో సీజన్ 9 జరగనుంది. “సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు” అనే వినూత్న థీమ్‌తో ఈ సీజన్ ముందుకు వస్తోంది.ఇప్పటికే విడుదలైన ప్రోమోలో నాగార్జున “డబుల్ హౌస్–డబుల్ డోస్” అని చెప్పడంతో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది.
ఎనిమిది విజయవంతమైన సీజన్ల తర్వాత, ఈ తొమ్మిదో సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ఈ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. కొత్త కాన్సెప్ట్ కారణంగా, బిగ్ బాస్ అభిమానులు షో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈసారి సామాన్యుల ఎంపికను నిర్వాహకులు ప్రత్యేకంగా చేశారు. “అగ్ని పరీక్ష” అనే ప్రీ-షో నిర్వహించి, వేలాది దరఖాస్తుల నుంచి 40 మందిని ఎంపిక చేశారు. వీరికి విభిన్నమైన కఠిన టాస్కులు ఇచ్చి, అందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ముగ్గురు మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు. ఈ ప్రీ-షోకు అభిజిత్, బిందు మాధవి, నవదీప్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
అధికారిక జాబితా ఇంకా వెలువడకపోయినా, సోషల్ మీడియాలో ఇప్పటికే కొన్ని పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. సాయి కిరణ్, ఛత్రపతి శేఖర్, ఇమ్మాన్యుయెల్, సుమంత్ అశ్విన్, రీతూ చౌదరి, అనిల్ (మై విలేజ్ షో) వంటి వారు ఈ సీజన్లో ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
రెండు ఇళ్లు–రెండు జట్లు అనే ఫార్మాట్ కారణంగా ఈసారి డ్రామా, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ రెట్టింపు స్థాయిలో ఉండబోతుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. సెలబ్రిటీలు – సామాన్యుల మధ్య జరగబోయే పోరులో ఎవరు విజేతలుగా నిలుస్తారో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 7 వరకు వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







