ప్రభుత్వ నిర్వహణలోని తొలి కిండర్ గార్టెన్..!!
- August 30, 2025
దోహా: ఖతార్ విద్య మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) ఈ విద్యా సంవత్సరం (2025-26) అల్-జివాన్ కిండర్ గార్టెన్‌ను ప్రారంభించనుంది. ఇది ప్రత్యేక అవసరాలు మరియు ప్రారంభ లెర్నింగ్ సవాళ్లతో ఉన్న పిల్లలకు ప్రత్యేకమైన ఖతార్ మొట్టమొదటి ప్రభుత్వ నిర్వహణలోని కిండర్ గార్టెన్‌గా ఇది గుర్తింపు పొందనుంది. పిల్లలు అభివృద్ధి మరియు లెర్నింగ్ సవాళ్లను అధిగమించడానికి కిండర్ గార్టెన్ ప్రత్యేక కార్యక్రమాలు మరియు వనరులను అందించనుందని మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ హెచ్ ఇ డాక్టర్ ఇబ్రహీం బిన్ సలేహ్ అల్ నుయిమి తెలిపారు.
ఖతార్‌లోని వివిధ ప్రాంతాలలో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలలో ఎనిమిది కొత్త పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) కార్యక్రమం కింద అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలు ఆధునిక, అధిక-నాణ్యత విద్యను అందించడానికి అధునాతన మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత స్థాయిలలో పోటీ పడగల కొత్త తరం విద్యార్థులను సిద్ధం చేయడమే తమ లక్ష్యమని డాక్టర్ అల్ నుయిమి అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!