కువైట్ లో యూత్ అవర్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్ సక్సెస్..!!

- August 30, 2025 , by Maagulf
కువైట్ లో యూత్ అవర్ ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్ సక్సెస్..!!

కువైట్: ఈ సంవత్సరం పబ్లిక్ అథారిటీ ఫర్ యూత్ “అవర్ ఇనిషియేటివ్స్” ప్రాజెక్ట్ ద్వారా 1,200 మందికి పైగా యువ కువైటీలు 15 విభిన్న రంగాలలో తమ ఆశయాలను సాధించారు. యూత్ అథారిటీ యాక్టింగ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మోసాద్ అల్-కురైబాని మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ సంస్థలకు ప్రత్యక్ష మద్దతును అందిస్తుందని, ఒక్కో ప్రాజెక్టుకు KD 25,000 వరకు నిధులు సమకూరుతాయని చెప్పారు. అదనపు కేటాయింపులలో KD 5,000, యువ వేదికలకు KD 10,000 మరియు సమావేశాలకు KD 15,000 చొప్పున నిధులు సమకూరుతాయని పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టు కింది సంస్కృతి, కళలు, సాహిత్యం, సైన్స్, టెక్నాలజీ, విద్య, ఆరోగ్యం, క్రీడలు, పర్యావరణం మరియు వ్యవస్థాపకత వంటి రంగాలలో యువతీ యువకులకు మద్దతు ఇస్తుందన్నారు. కువైట్ డిజిటల్ స్టార్టప్ క్యాంపస్ (KDSC)లోని కార్యక్రమాలు టెక్ స్టార్టప్‌లు మరియు చిన్న వ్యాపారాలకు సహాయక వాతావరణాన్ని అందిస్తాయని తెలిపారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com