భారత ప్రవాసుల కోసం కొత్త పాస్‌పోర్ట్ ఫోటో రూల్స్ ఇవే..!!
- August 30, 2025
దుబాయ్: కొత్త పాస్‌పోర్ట్ లేదా రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకునే దుబాయ్‌లోని భారతీయ ప్రవాసులు సెప్టెంబర్ 1 నుండి తాజా ఫోటో రూల్స్ ను పాటించాల్సి ఉంటుంది. ఎమిరేట్‌లోని భారత కాన్సులేట్ ఇప్పుడు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ఇకావో) ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఫోటోలను కలిగి ఉండాలని ప్రకటించింది. దరఖాస్తుదారులు తమ పాస్‌పోర్ట్ పత్రాలను సమర్పించేటప్పుడు అప్డేట్ చేసిన స్పెసిఫికేషన్లకు సరిపోయే కొత్త ఫోటోలను సమర్పించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రకారం కొత్త పాస్‌పోర్ట్ ఫోటో గైడ్ లైన్స్ క్రింది విధంగా ఉన్నాయి:
ఫోటో ఫార్మాట్: వైట్ బ్యాక్ గ్రౌండ్ .. 630*810 పిక్సెల్ సైజ్
ఫ్రేమింగ్ : హెడ్ అండ్ షోల్డర్ వరకు క్లోజప్, ఫ్రేమ్‌లో 80-85 ఫేస్ కనబడాలి.
ఫోటో క్వాలిటీ:
- కంప్యూటర్ మార్పులు లేదా ఫిల్టర్లు వాడకూడదు.
- నాచురల్ స్కిన్ టోన్లు కనిపించాలి
- ఫోటో అస్పష్టంగా ఉండకూడదు
లైటింగ్:
- షేడ్స్ లేకుండా సమానంగా లైటింగ్ ఉండాలి.
- ఫ్లాష్ రిఫ్లెక్షన్లు, గ్లేర్ లేదా రెడ్-ఐ ఎఫెక్ట్ కన్పించకూడదు
- సరైన లైటింగ్, కాంట్రాస్ట్ ఉండాలి
ఫేషియల్ ఫీచర్స్:
- కళ్ళు తెరిచి ఉండాలి. స్పష్టంగా కన్పించాలి.
- మౌత్ మూసి ఉండాలి.
- హెయిర్ నుండి చిక్ వరకు మొత్తం ఫేస్ కనిపించాలి
కవరింగ్‌లు
- కళ్లద్దాలు ఉండకూడదు
- మతపరమైన కారణాల వల్ల తలను కవర్ చేసేలా అనుమతి. అయితే, ఫేస్ స్పష్టంగా కన్పించాలి.
- ఫోటో 1.5 మీటర్ల దూరం నుంచి మాత్రమే తీసి ఉండాలి.
తాజా వార్తలు
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!







