ధహ్రాన్ మాల్ అగ్నిప్రమాదం.. SR250 మిలియన్ల బీమా..!!
- August 30, 2025
దహ్రాన్: తూర్పు ప్రావిన్స్‌లోని ధహ్రాన్ మాల్లో 2022లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబంధించిన బీమా క్లెయిమ్‌కు సంబంధించి అరేబియన్ సెంటర్స్ కంపెనీతో తుది పరిష్కార ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు అరేబియన్ షీల్డ్ కోఆపరేటివ్ ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఈ మేరకు సౌదీ ఎక్స్ఛేంజ్ (తడావుల్)కు పత్రాలను సమర్పించినట్లు పేర్కొంది.
అగ్నిప్రమాదం వల్ల తలెత్తిన అన్ని నష్టాలకు తుది పరిహారంగా SR250 మిలియన్ల ($66.7 మిలియన్లు) ఫైనల్ డీల్ ను కుదుర్చుకొని, ఆ మేరకు చెల్లింపులు పూర్తి చేసినట్లు బీమా సంస్థ తెలిపింది.
తూర్పు ప్రావిన్స్‌లోని ధహ్రాన్‌లో ఉన్న ధహ్రాన్ మాల్లో మే 13, 2022 అగ్నిప్రమాదం జరిగింది. మాల్లోని కొన్ని విభాగాలకు నష్టం వాటిల్లింది. అయితే, సకాలంలో స్పందించిన సివిల్ డిఫెన్స్ టీమ్స్ ప్రాణనష్టం జరగకుండా మంటలను అదుపు చేశాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







