బహ్రెయిన్ లో ఫస్ట్ గ్రేడర్స్ కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్..!!

- August 31, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో ఫస్ట్ గ్రేడర్స్ కోసం ఓరియంటేషన్ ప్రోగ్రామ్..!!

మనామా: 2025–2026 విద్యా సంవత్సరానికి మొదటి తరగతి విద్యార్థులను సిద్ధం చేయడంలో సహాయపడటానికి ప్రభుత్వ పాఠశాలల కోసం విద్యా మంత్రిత్వ శాఖ ఒక ప్రత్యేక ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఇందులో మానసిక, ఆరోగ్యం, విద్యా మరియు క్రీడా అంశాలను కవర్ చేసే వివిధ కార్యకలాపాలు ఉన్నాయి.  మొదటి రోజు నుండే విద్యార్థులు పాఠశాల జీవితాన్ని ఆస్వాదించేలా, కొత్త విద్యా ప్రయాణానికి సులువుగా అలవాటు పడటానికి సహాయపడే సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి ఇది ప్రయత్నిస్తుంది.

ప్రోగ్రామ్ గైడ్ ప్రకారం.. మానసిక, సామాజిక మద్దతును అందించడం, జాతీయ విలువలను పెంపొందించడం, ఇల్లు మరియు పాఠశాల మధ్య కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం ద్వారా ప్రాథమిక విద్యలోకి అడుగుపెట్టడాన్ని సులభతరం చేయడానికి ఓరియంటేషన్ ప్రణాళిక రూపొందించారు. విద్యార్థులను తరగతి గది సెట్టింగ్‌లకు పరిచయం చేసేలా కార్యక్రమాలను రూపొందించారు.  ప్రారంభ దశల నుండి విద్యార్థుల్లో విశ్వాసం, క్రమశిక్షణ మరియు ఆరోగ్యకరమైన అలవాట్లను  ఇది దృష్టి పెడుతుంది.  

పాఠశాలలు ఒక ప్రత్యేక ఓరియంటేషన్ బృందాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.  ఇందులో పాఠశాల ప్రిన్సిపాల్, వైస్-ప్రిన్సిపాల్, సోషల్ కౌన్సెలర్, ఫస్ట్-గ్రేడ్ టీచర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఆర్ట్ టీచర్లు, క్లాస్‌రూమ్ కోఆర్డినేటర్లు, హెల్త్ కౌన్సెలర్లు మరియు సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com