ఒమన్ గోల్డెన్ వీసా.. 10 ఏళ్ల రెసిడెన్సీకి గైడ్..!!
- September 01, 2025
సలాలా: పెట్టుబడిదారుల కోసం గోల్డెన్ రెసిడెన్సీ కార్యక్రమం దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా ఒమన్ స్థానాన్ని పటిష్టం చేయనుంది. ఇది పెట్టుబడిదారులకు మరియు వారి కుటుంబాలకు పదేళ్లపాటు రెసిడెన్సీ సదుపాయాన్ని అందిస్తుందని ఒమన్ వాణిజ్యం, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ బిన్ మొహమ్మద్ అల్ యూసఫ్ తెలిపారు.
గోల్డెన్ వీసా పొందేందుకు ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్‌లలో ప్రాపర్టీ కొనుగోలు, కంపెనీని స్థాపించడం, ప్రభుత్వ బాండ్లు లేదా వాటాల కొనుగోలుతోపాటు బ్యాంక్ డిపాజిట్లు కూడా ఉన్నాయని అన్నారు. సలాలాలోని సుల్తాన్ కబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో "సస్టైనబుల్ బిజినెస్ ఎన్విరాన్‌మెంట్" అనే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పెట్టుబడిదారుల కోసం గోల్డెన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్, ఒమన్ బిజినెస్ ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రానిక్ అటెస్టేషన్ ద్వారా కంపెనీ యాజమాన్యాన్ని బదిలీ చేసే సేవలతోపాటు నిర్మాణ రంగంలో వ్యూహాత్మక సహకారానికి సంబంధించి పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







