ఎస్సీవో వేదికగా..మోదీ కీలక వ్యాఖ్యలు
- September 01, 2025
SCO Summit: అమెరికా సుంకాలపై భారత్ను తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న ట్రంపు షాక్ ఇచ్చేదిశలో భారత్ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా చైనా, జపాన్, రష్యా, బ్రెజిల్ వంటి దేశాల మద్దతును కోరుతున్నది. గతరెండు రోజుల క్రితం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని, చైనాలో పర్యటిస్తున్నారు. తియాన్టిన్ వేదికగా జరుగుతోన్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (పిఎం మోదీ ఇన్ ఎస్స ఈవో సమ్మిట్)లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాద సమస్యను ప్రధానంగా లేవనెత్తారు. ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని పేర్కొన్నారు. ఈ సమస్యతో భారత్ నాలుగు దశాబ్దాలుగా ఇబ్బది పడుతోందన్నారు. అలాగే చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ ను ఆయన ప్రశ్నించారు. ఎస్సీవో సభ్యులుగా భారత్ కీలక భూమిక పోషిస్తోంది. ఎస్సీవోకు భద్రత, అనుసంధానం, అవకాశాలు మూడు పిల్లర్లుగా నిలుస్తున్నాయి. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. నమ్మకం, అభివృద్ధిని భారత్ నమ్ముతోంది. సభ్యదేశాలన్నీ సంయమనంతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలి’ అని మోది పేర్కొన్నారు.
పైశాచికత్వాన్ని చాటిన పహల్గాం
ఇటీవల పహల్గాం దాడి ఉగ్రవాదుల పైశాచికత్వాన్ని చాటిందన్నారు. ఆ దాడి వేళ భారత్కు మద్దతుగా నిలిచిన దేశాలకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రధాని షెహబాజ్ షరీఫ్ఎదుటే పాకిస్తాన్ వైఖరిని ఎండగట్టారు. అలాగే కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇచ్చాయని విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిని ఎస్సీవో ఖండించింది. టెర్రరిజంపై ద్వంద్వవైఖరి సరికాదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థించింది.
బీఆర్ఎస్ఐ ప్రాజెక్టును ప్రస్తావించిన మోది
ఈ ఎస్సీవో సదస్సులో చైనా నిర్మిస్తోన్న బీఎస్ఐ ప్రాజెక్టు గురించి మోదీ ప్రస్తావించారు. అనుసంధానం కోసం నిర్మిస్తోన్న ఈ తరహా ప్రాజెక్టులపై నమ్మకం, విశ్వాసం ఆధారంగా ముందుకువెళ్లాలని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని సూచించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మీదుగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింంది. అంతేకాకుండా బీఆర్ఎస్ఐ ప్రాజెక్టును తిరస్కరిస్తూ గతంలో భారత్ తన వైఖరిని వెల్లడించింది. మోది తన పర్యటనతో ఇతర దేశాలతో దౌత్యపరమైన అంశాలపై ఒప్పందాల దిశగా అడుగులువేస్తున్నారు. ట్రంప్ మొండిగా వ్యవహరిస్తూ, భారత్ను దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో భారత్ కూడా అమెరికాపై ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ సాయం కోసం దౌత్యసంబంధాలపై దృష్టిని సారించారు. ఇందులో భాగంగా జపాన్, చైనా పర్యటన కొనసాగిస్తున్నారు.
ఎస్సీవో సమ్మిట్ ఎక్కడ జరిగింది?
చైనాలోని తియాంజిన్‌లో 25వ ఎస్సీవో సమ్మిట్ జరిగింది.
మోదీ ప్రధానంగా ఏ అంశంపై దృష్టి సారించారు?
ఉగ్రవాదం, దాని ప్రభావం మరియు సభ్యదేశాల మధ్య భద్రతా సహకారంపై ప్రధానంగా దృష్టి సారించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్
- ఐటీ హబ్‌గా ఆంధ్ర ప్రదేశ్..
- మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
- ఆరుగురు కొత్త కంటెస్టెంట్లు ఎంట్రీ
- ఖతార్ ఆకాశంలో కనువిందు చేసిన అద్భుతం..!!
- మసీదులు, స్కూళ్ల వద్ద పొగాకు షాప్స్ పై నిషేధం..!!
- Dh430,000 గెలుచుకున్న భారత్, బంగ్లా ప్రవాసులు..!!