కల్కి 2898 AD సీక్వెల్‌పై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

- September 01, 2025 , by Maagulf
కల్కి 2898 AD సీక్వెల్‌పై డైరెక్టర్ క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్

‘కల్కి 2898 AD’ (Kalki 2898 AD sequel) తో ప్రేక్షకుల మదిలో చెరగని గుర్తింపును సంపాదించిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఇప్పుడు దాని సీక్వెల్‌పై దృష్టి పెట్టారు. ప్రభాస్ హీరోగా, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రం గతేడాది జూన్ 27న విడుదలై సెన్సేషన్ సృష్టించింది. సైన్స్ ఫిక్షన్, పురాణ కధలు, భవిష్యత్తు సాంకేతికత కలిపిన మిక్స్‌డ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్‌గా మారింది. అద్భుతమైన VFX, వేరే తరహా కథ, గ్రాఫిక్స్ మాంత్రికతతో పాటు ప్రభాస్ మాస్ ఇమేజ్ ఈ సినిమాకు బలమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్‌పైనే నిలిచింది. ఇటీవల నాగ్ అశ్విన్ ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొని ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, “మొదటి భాగం ఒక లెవెల్‌కి చేరుకుంది. దానిని మించిపోవాలంటే మరింత జాగ్రత్తగా పనిచేయాలి.

వీటన్నింటినీ పూర్తి చేయడానికి సమయం
సింపుల్‌గా సీక్వెల్‌ను స్టార్ట్ చేయడం కంటే, కంటెంట్, టెక్నికల్‌గా, ఎమోషనల్‌గా మరింత ఎత్తుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాం. అదే జరిగితేనే ప్రేక్షకులు సంతృప్తిగా థియేటర్‌ నుంచి బయలుదేరతారు” అని తెలిపారు.అలాగే నటీనటుల డేట్స్ విషయంలో కూడా సవాళ్లు ఉన్నాయని చెప్పారు. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొణె లాంటి స్టార్స్ అందరూ ప్రస్తుతం బిజీగా ఉండటంతో, వారి షెడ్యూల్స్ కుదిరితేనే సినిమా ముందుకు వెళ్లగలదని చెప్పారు. ఈ సీక్వెల్‌లో యాక్షన్ సన్నివేశాలు, భారీ సెట్‌పీస్‌లు, ప్రీ-విజువలైజేషన్ వర్క్ ఎక్కువగా ఉంటుందని, వీటన్నింటినీ పూర్తి చేయడానికి సమయం అవసరమని తెలిపారు.నాగ్ అశ్విన్ (Nag Ashwin) అభిప్రాయం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి కనీసం మరో 2–3 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంటే, ప్రేక్షకులు త్వరలో సీక్వెల్‌ను చూడలేరు కానీ, ఒకసారి ఆ స్కేల్‌తో, ఖచ్చితమైన ప్రిపరేషన్‌తో తెరకెక్కితే అది మరింత గొప్ప అనుభూతిని అందిస్తుందని హామీ ఇచ్చారు.

సెట్ వర్క్ మొదలైన తర్వాత స్పీడ్ పెంచే
నాగ్ అశ్విన్ వ్యాఖ్యల ప్రకారం, ప్రభాస్‌ను మళ్లీ కర్ణుడిగా చూడాలంటే అభిమానులు 2027 లేదా 2028 వరకు ఓపిక పట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. సెట్ వర్క్ మొదలైన తర్వాత స్పీడ్ పెంచే అవ‌కాశం ఉంది. విజన్‌ను తగ్గించకుండా, క్వాలిటీకి ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్.. సెకండ్ పార్ట్‌ను ఫస్ట్ పార్ట్‌కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మరోసారి భారత సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్ప‌నుంద‌ని ఖచ్చితంగా చెప్పవచ్చు. గ‌తంలో అశ్వినీద‌త్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్ర‌భాస్, క‌మ‌ల్‌, అమితాబ్ మ‌ధ్య‌నే సెకండ్ పార్ట్‌లో ఎక్కువ స‌న్నివేశాలు ఉంటాయ‌ని చెప్పుకొచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com