ఖతార్లో హెల్తీ అలవాట్లపై MOPH అప్పీల్..!!
- September 02, 2025
దోహా: ఖతార్ లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పిల్లల పెరుగుదలకు అవసరమైన ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతపై ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ను జారీ చేసింది. పోషకాలతో కూడిన సమతుల్య అల్పాహారంతో రోజును ప్రారంభించడం ఆరోగ్యకరమైన ఆహారంలో కీలకమని తన సోషల్ మీడియా పోస్టులో చెప్పింది.
పిల్లలలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించడానికి హెల్త్ మినిస్ట్రీ అనేక విషయాలను తెలిపింది. లంచ్ బాక్సులలో పోషకాలు, సమతుల్య ఆహారం ఉండేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు మరియు పెరుగు వంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ను అందించాలి. ఏకాగ్రత మరియు జ్ఞాపకశక్తిని పెంచడానికి వారానికి కనీసం రెండుసార్లు వివిధ రకాల చేపలను పిల్లలకు అందివ్వాలి.
పిల్లలను ఫాటేయర్, క్రోసెంట్ లేదా మఫిన్కు బదులుగా ఒక గిన్నె ఓట్ మీల్, తృణధాన్యాలు లేదా తృణధాన్యాల టోస్ట్తో రోజును ప్రారంభించేలా ప్రోత్సహించాలి. ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేయడానికి ప్రతిరోజూ తక్కువ ఫ్యాట్ ఉన్న పాలు మరియు పాల ఉత్పత్తులను అందివ్వాలి. తల్లిదండ్రులుగా ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం ద్వారా పిల్లల్లో వాటిపట్ల ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!







