భద్రతాపరమైన సవాళ్లపై సలాలాలో సింపోజియం..!!
- September 02, 2025
సలాలా: దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లోని సుల్తాన్ కబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్టైన్మెంట్లో కీలకమైన సౌకర్యాల భద్రతపై 4వ సింపోజియం ప్రారంభమైంది. మూడు రోజుల ఈ సింపోజియంను సెక్యూరిటీ అండ్ సేఫ్టీ సర్వీసెస్ కార్పొరేషన్ నిర్వహిస్తుంది.
వివిధ రకాలైన ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా భద్రతా పరమైన సవాళ్లపై ఈ సింపోజియంలో చర్చిస్తున్నారు. కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించడం, సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడం, భద్రతా సంస్థలు మరియు నిపుణుల మధ్య భాగస్వామ్యాలను పెంపొందించడం వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా హాజరైన నిపుణులు చర్చిస్తున్నారు. ఈ సందర్భాంగా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, పరికరాలను ప్రదర్శిస్తున్నారు.
అలాగే, భద్రతలో ఏఐ పాత్ర, కార్యాలయాల్లో ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, చమురు మరియు గ్యాస్ పరిశ్రమల్లో కార్మికుల ఆరోగ్యం, భద్రత, పర్యావరణ సవాళ్లతోపాటు సైబర్ భద్రతపై పెద్దఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







