సహోద్యోగితో లవ్ ఎఫైర్.. ఊడిన నెస్లే సీఈవో పదవి

- September 02, 2025 , by Maagulf
సహోద్యోగితో లవ్ ఎఫైర్.. ఊడిన నెస్లే సీఈవో పదవి

నెస్లే సీఈవో లారెంట్ ఫ్రీక్సే(Laurent Freixay) తన కిందిస్థాయి ఉద్యోగితో ఎఫైర్ నడిపించాడు. ఇంకేమి ఉంది తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. తన సబార్డినేట్తో అక్రమ సంబంధం వ్యవహారమే ఈ సీఈఓ కొంప ముంచినట్లు తెలిసింది. ఉద్యోగితో సీక్రెట్ రిలేషన్షిప్ పెట్టుకున్నట్లు రుజువు కావడంతో లలాంరెంట్ ఫ్రెక్సీని సంస్థ విధుల నుంచి తొలగించినట్లు ఈ సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంపై అంతర్గత దర్యాప్తు చేపట్టిన సంస్థ ఆరోపణలు నిజమని తేలడంతో సీఈవోను ఇంటికి పంపించి వేసింది.

సంస్థ నియమావళిని ఉల్లంఘిస్తే సహించం
ఇలాంటి వ్యవహారాలు నెస్లే నిబంధనలకు వ్యతిరేకమని సంస్థ వివరించింద. సంస్థ నియమావళిని ఉల్లంఘించడం వల్లే ఫ్రెక్సీని తొలగించినట్టు నెస్లే సంస్థ స్పష్టంచేసింది. ఆయనపై ఆరోపణలు రావడంతో జరిపిన అంతర్గత దర్యాప్తులో ఫ్లెక్సీ సంబంధం గురించి నిజం అని తేలినట్లు పేర్కొంది. ఈ దర్యాప్తును సంస్థ ఛైర్యన్ పాల్ బల్కీ స్వయంగా పర్యవేక్షించినట్లు వెల్లడించింది. ఆరోపణల నేపథ్యంలో సీఈఓను తొలగించకతప్పలేదని చైర్మన్ పాల్ బల్కీ పేర్కొన్నారు. దీనిపై ఛైర్మన్ పాల్ బుల్కే(Chairman Paul Bulke), ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ పాబ్లో ఇస్లా నేతృత్వంలో దర్యాప్తు కొనసాగుతుందని తేల్చి చెప్పింది. నేనేళ్ల పాలన వ్యవస్థలో ఎలాంటి మార్పులు ఉండవని, అన్ని పనులు యథాతథంగా కొనసాగుతాయని చెప్పారు. నైతిక విలువలు, పరిపాలనా విధానమే సంస్థకు బలమైన పునాదులని వివరించింది. తమ విలువలు కంపెనీకి బలమైన పునాదులని పాల్ బుల్కే పేర్కొన్నారు. కాగా, ఫ్రెక్సీ స్థానంలో నెస్లే సీనియర్ ఉద్యోగి ఫిలిప్ నవ్రాటిల్ ను నియమించనున్నారు.

సుదీర్ఘకాలం పనిచేసిన లారెంట్
కాగా లారెంట్ ఫ్రీక్సీ 1986లో నెస్లేలో చేరి సుదీర్ఘకాలం సేవలను అందిస్తున్నారు. 2024 సెప్టెంబరులోనే సీఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. గత కొంతకాలంగా నెస్లే ఆర్ధికంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. గతేడాది కంపెనీ షేరు ధర దాదాపు పావువంతు పడిపోయింది. ఈ ఏడాది ప్రథమార్థంలో లాభాలు ఇకూడా 10.3 శాతం తగ్గాయి. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించడం వల్లే యాజమాన్యం కంఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

నెస్లే సీఈవో పదవిని ఎందుకు కోల్పోయారు?
ఆయన ఒక సహోద్యోగితో లవ్ ఎఫైర్ పెట్టుకున్నందున, అది కంపెనీ నైతిక నియమాల ఉల్లంఘన కిందకు వస్తుంది. అందుకే ఆయనను పదవి నుంచి తొలగించారు.

నెస్లే కంపెనీలో సహోద్యోగుల మధ్య సంబంధాలు నిషేధమా?
అవును, నెస్లే కంపెనీ తన ఉద్యోగుల మధ్య వ్యక్తిగత సంబంధాలపై కఠినమైన నైతిక నియమాలను కలిగి ఉంది. ఇది కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు విరుద్ధం

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com