న్యూయార్క్‌లో క్రౌన్ ప్రిన్స్, మాక్రాన్ భేటీ..!!
- September 03, 2025
మనామా: సెప్టెంబర్ 22న న్యూయార్క్‌లో జరిగే టూ స్టేట్ సొల్యుషన్ కాన్ఫరెన్స్ కు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షత వహించనున్నారు. ఈ మేరకు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఒక ప్రకటనలో తెలియజేశారు.
పాలస్తీనా అధికారులకు వీసాలు నిరాకరించడానికి వాషింగ్టన్ తీసుకున్న చర్యను మాక్రాన్ విమర్శించారు. దీనిని "ఆమోదయోగ్యం కాదు" అని మరియు పాలస్తీనా భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి UN హోస్ట్ కంట్రీ ఒప్పందానికి అనుగుణంగా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
టూ స్టేట్ పరిష్కారానికి విస్తృత అంతర్జాతీయ మద్దతు కావాలని, దాంతోనే ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందన్నారు. అంతకుముందు దీనిని సాధించడానికి శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల, గాజాకు పెద్ద ఎత్తున మానవతా సహాయం అందించడం మరియు స్థిరీకరణ మిషన్‌ను మోహరించడం అవసరమని ఆయన అన్నారు.
హమాస్‌ను నిరాయుధీకరించి పాలన నుండి మినహాయించాలని, పాలస్తీనా అథారిటీని సంస్కరించి బలోపేతం చేయాలని మరియు గాజాను పూర్తిగా పునర్నిర్మించాలని, నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మాక్రాన్ అన్నారు.
తాజా వార్తలు
- భారత్‌కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్