రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- July 19, 2016
ఎమిరేటీ మహిళ, కారు ప్రమాదంలో మృతిచెందింది. ఆమె ప్రయాణిస్తున్న కారు, ఓ ట్రక్‌లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో కారుకి మంటలు అంటుకున్నాయి. దుబాయ్ వైపుగా ఉన్న యాస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు స్పందించారు. రహదారిపై ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. రహదారిపై ప్రయాణించేవారు ట్రాఫిక్ రూల్స్‌ని పాటించాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. భద్రతే ముఖ్యమని, ఈ విషయంలో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి







